తిరుపతి, - స్వీయ అనుభవాలను శాస్త్రీయతతో నిరూపణ చేసి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అనే పుస్తకాన్ని దొరై రాజ్ అందించారని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఆచార్య జంపాల వెంకటరమణ పేర్కొన్నారు.విశ్వామిత్ర సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం యశోద నగర్ లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి అనుసరించాల్సిన 50 మార్గాలను రచయిత ఈ పుస్తకంలో సూచించారని చెప్పారు. అధ్యక్షత వహించిన కథా రచయిత ఆర్. సి. కృష్ణస్వామి రాజు మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలను దొరై రాజ్ తనదైన శైలిలో వివరించి అందుబాటులోకి తీసుకురావడం వెనుక ఎంతో అనుభవం,కష్టం దాగి ఉందని అన్నారు.విశిష్ట అతిథిగా పాల్గొన్న ఉద్యోగ సోపానం ఎడిటర్ ఎస్. వి. సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో అక్షరం తన రూపాన్ని మార్చుకుందని అయినా అక్షరం విలువ తగ్గలేదని అన్నారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి అందరికీ అర్థమయ్యేలా సులభ శైలిలో ఉన్న ఇలాంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాలని సూచించారు.రచయిత దొరై రాజ్ స్పందిస్తూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తనలోని జ్వలించే తపన ఆధారంగా ప్రతి ఒకరు ఉన్నత స్థితికి చేరుకోవడానికి అనువుగా ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు. ప్రాచ్య పరిశోధన సంస్థకు చెందిన డాక్టర్ టి.రాజశేఖర్ పుస్తక సమీక్ష చేయగా మహిళా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై. సుభాషిణి,భాషా శాస్త్రవేత్త ఎస్. భాస్కర్ రాజు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కే.సుబ్రహ్మణ్యం, దాసరి చంద్రయ్య,ఏ. మల్లేశ్వరరావు, డాక్టర్.బి. చక్రపాణి, సీఎన్ శరవణ, ప్రియాంక,ప్రేమ్ చంద్ విశ్వనాథరాజు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
"ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి" పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి