నిదురించే జగతిని
పరిమళింప చేయు
మందారపు వన్నెల
మనోహరమైన వెలుగులు!
దిక్కులకావల దివ్యంగా
చుక్కల దారిని చక్కగా
మక్కువ నిండిన చూపులతో
కొత్తగ వచ్చే వెలుగులు
ఎగిరే గువ్వలు పాడే
కువకువల వేదానాదాలను
తిరిగే గాలులు వినిపిస్తుంటే
తరలి వచ్చు వెలుగులు
భువిని భవ్యమైన పెక్కు
కాంతి పుంజములు కురిపి
కనకమయముగా మార్చు
దినకరుని సిరివెలుగులు
మానవాళి మనుగడలో
మమతానురాగాలు నింపి
మానవత్వము మరువక
మనమని బోధించే వెలుగులకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి