గోదావరి జిల్లాల నివాసులం,
మంచితనానికి వారసులం,
అనురాగానికి బానిసలం,
ఆప్యాయతలుకు ఆనవాళ్ళం !
మమకారం అంటే మక్కువ ,
మాకు వెటకారం కాస్త ఎక్కువ !
కల్లాకపటం తెలియని వాళ్ళం,
కరుణ రసానికి కరిగిపోతాం!
సాటి వారిని ప్రేమతో బందిస్తాం ,
కష్టం వస్తే తక్షణంస్పందిస్తాం !
పరోపకారం మా ధ్యేయం,
పరస్పర సహకారం మా లక్ష్యం!
మొహమాటానికి మారు పేరు ,
మమతానురాగాలు మా ఇంటి పేరు!
"ఆయ్......"అన్నది మా ఊత పదం,
"ఏమండీ" అని పిలవడం ,
మా ఆచారం !
కులం జాడ్యం లేని వాళ్ళం ,
మతం మత్తు ఎరుగని వాళ్ళం !
కల్మషం అంటే తెలియని వాళ్ళం ,
స్నేహం అంటే ప్రాణం ఇస్తాం ,
ఇదేగోదారోళ్ళ నిలువెత్తుసంతకం!!
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి