సుప్రభాత కవిత : - బృంద
వేలుగా విరిసిన పువ్వులు 
ఊగుతూ పోయే హొయలు 
సాగుతూ జారే నీటికి 
స్వాగతం చెప్పే సొగసులు

ఏటిలో అలల సవ్వడికి 
లయగా  ఊగే  మొక్కలకు 
ఏవిటో  కుదిరిన నెయ్యం 
చూచుటే ముచ్చట నిజం

పూల చీర చుట్టిన 
పుడమి పడుచు 
పలకరించు గాలికి 
పులకరించి పోయె!

కొండల చాటున విరిసి
మబ్బుల పరదాల చాటున 
దాగిన వెలుగు పువ్వు 
వచ్చుదారి కాచి వసుధ  వేచే!

ప్రకృతిలోని  సౌందర్యాన్ని 
వర్ణించే  అక్షరాలు..లేవు 
అది చూచిన మది పొందే 
హాయిని చెప్పే మాటలు కలవే?!

ఎంతటి అందానికైనా 
వెలుతురులోనే వైభవం 
ఏ ఆలోచన ఆచరణ కైనా 
వేకువేగా చక్కని మార్గం 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు