రామలక్ష్మణులను చూసిన సుమతి మహారాజు
ఓ విశ్వామిత్ర ఈ చిన్నారులు ఎవరు స్వామి
దివ్య తేజస్సుతో వెలుగుచున్నారు
వీరి గూర్చి నాకు తెలుపుమయ్యా
ఆకాశాన సూర్యచంద్రుల వలె ఉన్నారు
శ్రేష్టమైన ఆయుధములను ధరించినారు
వీరు అడవులలో నడుచుట కారణమేమి
వీరి గూర్చి నేను వినగోరుచున్నానయ్యా
ఓ సుమతి మహారాజ వినుమయ్యా
వీరు దశరథుని పుత్రులు రామలక్ష్మణులు
వీరు నాకు అతిథిలుగా లభించడం
చాలా అదృష్టము ఓ మునీశ్వర
రామలక్ష్మణులకు సుమతి మహారాజు
చక్కని గౌరవ సత్కారములు చేసినాడు
ఆరోజు వారు అచట గడిపినారు
ఉదయాన నిద్రలేచి వారందరూ
మిథిలానగరమునకు బయలుదేరినారు
జనకపుర సమీపమున ఆశ్రమం
ఆ ఆశ్రమము కనుల జూచి రాముడు
ఓ మునివరా ఆశ్రమము ఎవరిదయ్యా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి