శ్రీమద్రామాయణము బాలకాండము: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
గంగా అగ్నిదేవుని మాటలు విని 
అందమైన స్త్రీ రూపమును దాల్చినది 
ఆమె సౌందర్యం చూసి అగ్నిదేవుడు 
శివ తేజస్సును ఆమెపై వ్యాపింపజేసెను 

అగ్ని తేజస్సు తాపమునకు తట్టుకోలేక గంగాదేవి 
దేవతలను అగ్నిదేవుని ప్రార్థిస్తుంది 
అప్పుడు అగ్నిదేవుడు గంగతో ఇలా అంటాడు 
గర్భం శ్వేతపర్వత వద్ద యుంచుము 

గంగాదేవి అగ్ని దేవుని మాటలు విని 
మిక్కిలి తేజస్ కలిగిన గర్భమును 
తన ప్రవాహముతో శిఖరం వద్ద వదులుతుంది 
ఆ ప్రదేశం అంతా స్వర్ణకాంతితో వెలుగుతుంది 

తనంతరం అక్కడ అగ్ని తేజస్సుతో 
సువర్ణ కాంతుల్లో అందమైన బాలుడు జన్మించాడు 
ఇంద్రుడు ఆ బాలుని సంరక్షణ కొరకు 
ఆరుమంది కృతికలను నియమించినాడు 

ఆ బాలుడు ఉన్న పర్వత నేల మెరుస్తుంది
అగ్ని తూలుడైన కారణజన్మునికి దేవతల బ్రాహ్మణులు కూడి 
కార్తికేయుడని పేరు పెట్టినారు 

అప్పుడు ఆరుగురి కృత్రికల సనుపాలను
ఆ బాలుడు తాగి  తన పరాక్రమం తో రాక్షసులను జయించినాడు 
దేవతల సేనాపతిగా ఆ బాలున్ని అభివర్ణించారు


కామెంట్‌లు