ప్రేమే సర్వస్వం:- - యామిజాల జగదీశ్
గోపికల పాదాలకు ముల్లు
గుచ్చుకోవడంతో కలిగిన బాధను
ఇట్టే మటుమాయం చేస్తానన్న
కృష్ణుడి లీలలు
అసాధారణం

సాయంకాలపు బంగారు కిరణాల సాక్షిగా రాధాకృష్ణుల దివ్య ప్రేమ వికసించింది.

సాయంకాలపు బంగారు కాంతిలో బృందావనం చిరునవ్వు చిందించింది.

అప్పుడు కృష్ణుడు అపారమైన ప్రేమతో రాధ పాదాలలో గుచ్చుకున్న చిన్న ముల్లును తీసేశాడు.

బృందావనంలోని 
ఆ సుందరమైన వీధిలో 
జరిగిన ఈ క్షణం 
ఒక సాధారణ దృశ్యం కాదు
అది గాఢమైన భక్తి భావన
రాధ పాదాలలో గుచ్చుకున్న 
ఆ ముల్లు చిన్నదే కావచ్చు
నిజమైన ప్రేమ పరిమాణాన్ని ప్రపంచానికి తెలియజేసింది

ఎందుకంటే, 
శ్రీకృష్ణుడే స్వయంగా 
రాధ పాదాల వద్ద కూర్చుని 
ముద్దు ముద్దు మాటలు
చెప్తూ
గుచ్చుకున్న ముల్లుతో
రాధ పడుతున్న బాధను తొలగించాడు

ఈ క్షణం మనకు చెప్పే సత్యం ఏమిటంటే

నిజమైన ప్రేమ అంటే 
హక్కులు ఇవ్వడం కాదు,
సేవ చేయడం
సపర్యలు చేయడం
సంపూర్ణ శరణాగతితో
అర్పించుకోవడం

ఆ అద్భుతమైన దృశ్యం చుట్టూ నిల్చున్న గోపికలందరూ మంత్రముగ్ధులయ్యారు

వారి అరచేతులుసైతం  
నిశ్చలంగా నిలిచిపోయినట్లు అనిపించాయి

ఎందుకంటే వారి కళ్లెదుట జరుగుతున్నది 
సాధారణ అనురాగం కాదు
అది మాటల్లో వర్ణించలేని 
దివ్యమైన ప్రేమ

ఈ దృశ్యాన్ని చూసి 
శ్రీకృష్ణుడి సహచరులు కూడా పరమానందంతో 
ఉప్పొంగిపోయారు
వారి ముఖాలు ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయాయి

ప్రకృతి 
స్వయంగా ఆ క్షణాన్ని 
తనలో ముద్రించుకోవాలని కోరుకుంటున్నట్లుగా 
అనిపించింది

సూర్యుని బంగారు కిరణాలు
దగ్గరలో పారుతున్న నీటి 
మధురమైన నాదం
పువ్వుల పరిమళం
బృందావనంలోని పవిత్రమైన గాలి

ఇవన్నీ కలిసి ఆ క్షణాన్ని మరింత దివ్యంగా మార్చాయి
అక్కడ రాధాకృష్ణులు మాత్రమే లేరు ప్రేమ, కరుణ, త్యాగం, భక్తి అన్నీ సజీవసాక్షులయ్యాయి

ఈ దృశ్యం 
మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది

నిజమైన ప్రేమ ఉన్నచోట
అహం ఉండదు
అసోం ఉన్న చోట
ప్రేమ ఉండదు

అక్కడ 
ఇతరుల బాధను 
తనదిగా భావించే 
సున్నితమైన హృదయం 
మాత్రమే ఉంటుంది.

రాధాకృష్ణుల ఈ దివ్యమైన ప్రేమ ప్రపంచానికి ఎల్లప్పుడూ చెప్పేదిదే

ప్రేమే సత్యం
ప్రేమే శివం
ప్రేమే సుందరం
ప్రేమే దైవం 
ప్రేమే నిత్యం
ప్రేమే సర్వస్వం

భక్తి
శరణాగతి
ఆనందం
అనుభూతి 
ఏకమైన చోట
ప్రేమ అనంతం


కామెంట్‌లు