తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 11మే నుండి 17 మే -2026 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగో రోజు కళాశాల విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు , రైతు బజార్ ప్రాంతాలు మరియు ప్రజా ప్రదేశాలలో తిరుగుతూ ప్రజలకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అవగాహన కల్పించారు.
విద్యార్థులు చేతపత్రాలు పంపిణీ చేస్తూ, ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానిని వివరించారు. ముఖ్యంగా ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నివారించాలని, బదులుగా వస్త్ర సంచులు మరియు పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ, సమాజంలో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడంలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రజల్లో మంచి స్పందన తీసుకువచ్చారు.
కార్యక్రమంలో సహాయ ఆచార్యులు ,కార్యక్రమం నిర్వాహకుడు రాథోడ్ శ్రావణ్, మరియు అధ్యాపకులు అనీల్ గారు విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ ద్వారా ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి