అసమర్ధుని సమర్థుని చేసేది డబ్బు
పిరికివాన్ని ధైర్యవంతునిగా మార్చేది
డబ్బు
మూర్ఖున్ని తెలివి గలవానిగా మార్చేది
డబ్బు
కురూపినీ కూడా ప్రేమించబడేట్లు చేసేది
డబ్బు
బికారిని రాజును చేసేది డబ్బు. కానీ
దానిపై ఆసక్తి లేనివాడు సమర్థుడు కాడనేది
నిజం.!!?
అది వజ్రం
అది రత్నం
కానీ అది నాకు మెరిసే రాయి మాత్రమే
అనేవాడు నిజంగా అజ్ఞాని.!!
అది బంగారం
అది వెండి
అది ప్లాటినం కానీ
అది కేవలం లోహం మాత్రమే
అనేవాడు అమాయకుడు..!!
మనిషి వ్యాపారం చేయడం ప్రారంభించాడు.
వ్యాపారం చేయడం కోసం మనిషి
ఈ ప్రపంచంలో దేన్నీ వదిలిపెట్టలేదు.
మానవ వనరులను సహజ వనరులను
మనిషిని మానవత్వాన్ని స్త్రీని తెలివిని అజ్ఞానాన్ని
దేవుణ్ణి కళలను ఆరోగ్యాన్ని విద్యను సేవను
దేన్ని వదిలిపెట్టలేదు. కానీ వ్యాపారం
మా వంశంలోనే లేదు అని అనేవాడు
నిజంగా నిరుపేద..!!
గాల్లో మాటలు
నీటిపై రాతలు
పేదవానివీ!
రాతిపై రాతలు
ధనవంతునివీ!!
ధనవంతుడు
యమధర్మరాజు!
పేదవాడు
ధర్మరాజు...!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి