బంధనాల విముక్తి. : - తాతోలు దుర్గాచారి. -తెలంగాణ సాహితి -భద్రాచలం శాఖ.
బంధనాల విముక్తియే స్వేచ్ఛ 
పేగు బంధం తెంచుకుంటేనే పుట్టే బిడ్డకు తల్లి గర్భం నుండి విముక్తి. 
బంధాల ముడులు విప్పుకుంటేనే బతుకు బండి ముందుకు సాగేది. 
అడ్డుతగిలే ముడులే ముందు పయనానికి అడ్డంకులు. 
పురోగమనమే స్వేచ్చ కావాలి 
పతనానికి నాంది స్వేచ్ఛ కాకూడదు. 
ఆటంకాలే స్వేచ్ఛను హరిస్తాయి.  
అవినీతి, అక్రమాలు ప్రగతికి అవరోధాలు.
స్వేచ్ఛ కు తిరోగమనాలు.  
బానిసత్వపు విముక్తియే..
భరత జాతి స్వేచ్ఛా జీవనం 
స్వచ్ఛమైన జీవనయానమే స్వేచ్ఛ. 
అనుక్షణం కష్టాల కొలిమిలో కుమిలిపోవడమే బంధికానా అణిగిమణిగి బతుకీడ్చడమే బానిసత్వం. 
బంధనాలు తెంచుకుని భవిత ను దిద్దుకోవడమే స్వేచ్ఛ. 
మెరుగైన బతుకు పోరాటానికి 
ఆయుధం కావాలి స్వేచ్ఛ.  
స్వేచ్ఛే జీవం,స్వేచ్ఛే మూలం. 
బంధనాలు విముక్తియే స్వేచ్ఛ 
****"""**** 


కామెంట్‌లు