అదిగో అల్లదిగో శ్రీహరివాసమని,కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడనిఅంతర్యామి అలసితి సొలసితి యని,బ్రహ్మ కడిగిన పాదమని,చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ యని,బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే యని,పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంతపెడమరలి నవ్వినే పెండ్లి కూతురు యని,కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండతెట్టలాయ మహిమలే తిరుమల కొండ యని,అలతి అలతి పదాలతోజీవితమంతా ఏడుకొండల వేంకటేశ్వరుని పైఎన్నో వేల కీర్తనలనుపండిత పామరులకు అర్ధమయ్యే రీతిలో రచించినమొదటి వాగ్గేయకారుడుతాళ్ళపాక అన్నమాచార్యులు పదకవితా పితామహులుసంకీర్తనా చార్యులుఆధ్యాత్మిక ,భక్తి, శృంగార రస కీర్తనలతోనేటికి తెలుగునాట అజరామరంగాకీర్తింపబడుతున్న సంగీత సరస్వతీ పుత్రులువారికివే నా అక్షరాంజలులు..!!( వైశాఖ శుక్ల పౌర్ణమి అన్నమయ్య జయంతి సందర్భంగా వ్రాసినది)...........................
అన్నమయ్య కీర్తనలు అజరామరం.: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్టమి)- విశాఖపట్నం.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి