ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 'గద్దర్ అవార్డు'ను కైవసం చేసుకున్న 'వనజీవి రామయ్య' చిత్ర బృందం, బుధవారం తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని గవర్నర్ అభినందించారు.
అవార్డు విజేతల సంతోషం
ఈ భేటీలో చిత్ర దర్శకులు వేముగంటి, నిర్మాతలు లింగంపల్లి చంద్రశేఖర రావు, నిడిగొండ నరేష్ కుమార్, నటి నాగరాణి, సంగీత దర్శకులు, గాయకులు బల్లేపల్లి మోహన్, డీఓపీ తోట రమణ, రచయిత ఘనయాది పాల్గొన్నారు. తమ చిత్రానికి లభించిన ఈ గౌరవం మొత్తం యూనిట్ సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు అని, ఇది తమకు మరింత బాధ్యతను, ప్రేరణను ఇస్తుందని బృందం పేర్కొంది. ప్రకృతి పరిరక్షణ, మానవీయ విలువలు సామాజిక బాధ్యతను చాటిచెప్పే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం పై వారు సంతోషం వ్యక్తం చేశారు.
బేబీ బ్లెస్సికి 'వనజీవి రామయ్య' అభినందనలు
ఈ కార్యక్రమంలో భాగంగా, వనజీవి రామయ్య చిన్నారి బేబీ బ్లెస్సిని ప్రత్యేకంగా అభినందించారు.
అతి చిన్న వయసులోనే పర్యావరణంపై ఆసక్తితో మొక్కలు నాటుతూ, సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తున్న బేబీ బ్లెస్సి సేవలను ఆయన కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆమె ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
శుభాకాంక్షల వెల్లువ
చిత్ర బృందం గవర్నర్ ను కలిసి ఆశీస్సులు పొందడంపైవికారాబాద్ జిల్లా తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు, సోషల్ వర్కర్ కేవిఎం వెంకట్ హర్షం వ్యక్తం చేస్తూ, చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి