మనసు బందీ...!:- ఈగాపాటిరంజాన్.
స్వేచ్ఛ గురించీ రాస్తుంటే 
నా కలము నా గొంతుని 
మూగబోయేల రాయకు నేస్తమా 
అంటూనే అడుగులకు మడుగులు
ఒత్తె కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ 
పది కాలాల పాటు సమాజపు వీధుల్లో విహరిస్తా అంటుంది 
నిండిన పేజీని తీపేస్తూ స్వేచ్ఛ గురించీ రాస్తుంటే 
ఓటరు కార్డులో ఉన్న ప్రశ్నించే తత్త్వం నా మనసు సాక్షిని అడిగింది నోటు తీసుకొని 
నిజాన్ని కడిగే స్వేచ్చను కట్టిపడేశావని 
ఆలోచిస్తూ ప్రయాణం చేస్తుంటే
ఎదురుబడ్డాయి ప్రేమను పంచి 
స్వేచ్చను కోల్పోయి వృద్ధాశ్రమంలో జ్ఞాపకాల
బువ్వలను తినిపించుకుంటున్న
జీవితాలు స్వేచ్ఛ గురించీ రాస్తుంటే ఎదురుబడ్డాయి...!!


కామెంట్‌లు