సగరుడు స్వర్గస్తుడైన పిదప
మంత్రులు న్యాయసమ్మతముగా
అంశమంతుడిని రాజుగా కోరుకున్నారు
ఉత్తముడైన అంశుడు రాజు అయినాడు
అంశుని పుత్రుడు దిలీపుడు
అతడు మిక్కిలి సుప్రసిద్ధుడు
అంశమంతుడు కొన్ని రోజుల తర్వాత
దిలీపునకు రాజ్య భారము అప్పగించి
గంగావతరనార్థమై హిమగిరిలలో
తీవ్రమైన తపస్సు ఆచరించాడట
తాతల సద్గతులక్ తండ్రి
తపస్సు చేస్తూ
ఆ కోరిక తీరక ముందే స్వర్గస్తుడైనాడు
దిలీపుడు శోకము నుండి తేరుకొని
తాతల పుణ్యకార్యం గూర్చి యోచన చేస్తూ
దిలీపుడు దివి నుండి భువికి గంగను
తెచ్చుట ఎలా నేను ఇచ్చట తాతలకు
సద్గతులు కలిగించుట ఎలా అనే యోచనలో
నిత్యము ధర్మకార్యములను చేస్తున్నాడు
కొంతకాలము గడిచిన తర్వాత
అతనికి భగీరథుడను పుత్రుడు కలిగి
పరమ ధార్మికుడిగా పేరుగాంచెను
దిలీపు పెక్కు యజ్ఞములను చేసి
తన పుణ్యాఫలముచే స్వర్గము చేరినాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి