రక్తం ఒక్క చుక్క జారినా
గుండెల్లో భయం మేల్కొంటుంది
చిన్న గాయం అయినా సరే!
బాధ మరింతగా పెరుగుతుంది !.
నవ్వుల వెనక దాగి ఉంటుంది
ఒక మౌనమైన పోరాటం
ప్రతి రోజు ప్రతిక్షణం
జాగ్రత్తలతో సాగే జీవతం
ఇది శరీరానికి వచ్చిన వ్యాధైనా
మనసుకు ఓటమి కాదు
ధైర్యం చేతిలో ఉంటే
ప్రతి కష్టం దాటే దారి ఉంటుంది.
తల్లి కళ్ళలో ఆందోళన
పిల్ల నవ్వులలో అమాయకత్వం
ప్రేమతో జాగ్రత్తతో
ప్రతి రోజూ ఒక కొత్త ఆశ
రక్తం ఆగకపోయినా
ఆశ మాత్రం ఆగదు
బాధ వెంట వచ్చినా
బలం మాత్రం తగ్గదు
హీమోఫిలియా ఉన్న జీవితం
పోరాటమే అయినా
ధైర్యం అనే ఔషధంతో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి