భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము- 250 వ రోజు
ఘటోత్కచుని యుద్ధం
ఇది చూసిన ఘతోత్కచుడు తండ్రికి సాయంగా వచ్చాడు. సాయంకాలం సమీపించడంతో అది తన మాయా యుద్ధమునకు అనువైనదని అనుకుని ఏనుగు ఎక్కి కౌరవ సేనను ఎదుర్కొన్నాడు. దిక్పాలకులను వెంట పెట్టుకుని ఇంద్రుడే వస్తున్నాడా అని భ్రమ కలిగించాడు. ఘతోత్కచుడు సుయోధనుని మీదకు తన ఏనుగును పోనిచ్చాడు. భగదత్తుడు ఘతోత్కచుని అడ్డుకున్నాడు. ఘటోత్కచుడు భగదత్తుని పట్టుకుని ఏనుగును చంపి భగదత్తుని విసిరి వేసాడు. ఘతోత్కచుడు తిరిగి సుయోధనుని ఎదుర్కొన్నాడు. ఇది చూసిన భీష్ముడు ద్రూణునితో " ఆచార్యా ! మాయా యుద్ధంలో ఘతోత్కచుడు ఆరితేరిన వాడు. ఇప్పటికే భదత్తుని ఏనుగుతోసహా చంపాడు. భదత్తుని వంటి మహా వీరుని ఒక్క దెబ్బతో మట్టికరిపించిన ఘటోత్కచుని చేతిలో సుయోధనుడు పడకుండా కాపాడాలి " అని చెప్పి " కౌరవ వీరులారా ! ఘటోత్కచుని నుండి సుయోధనుని కాపాడాలి రండి ఘతోత్కచుని ఎదుర్కొనండి " అని సేనలను సమాయత్తం చేసి తనూ అక్కడకు చేరుకున్నాడు . భీష్ముని పిలుపందుకుని కౌరవ సైన్యం ఘతోత్కచుని పై ఒక్కుమ్మడిగా పడ్డారు. ఇది చూసిన యుధిష్టరుడు మత్స్య, పాంచాల సైన్యాలతో దండనాయకులను చేర్చుకుని కౌరవ సేనలను ఎదుర్కొన్నాడు. యుద్ధం భీషణ రూపందాల్చింది. భీష్ముడు పాండవ సేనలను వీరవిహారం చేస్తూ తనుమాడు తున్నాడు. ఘతోత్కచుడు సింహనాదం చేసాడు అతడి సింహనాదం విన్న కౌరవ సేనలు నిజంగానే సింహం వచ్చినదని భ్రమపడి కకావికలై పోయారు. ఇది చూసిన భీష్ముడు ద్రోణునితో " ఆచార్యా ! సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఘతోత్కచుని బలం ఇక ద్విగుణీకృతం ఔతుంది కనుక ఇప్పుడు అతనితో పోరు ఆపదకు దారి తీస్తుంది కనుక మనం ఈ రోజుకు పోరు నిలిపి రేపు వస్తాము అన్నాడు. ద్రోణుడు అందుకు అంగీకరించి కౌరవ సేనలను వెనుకకు మరల్చాడు. భేరి, తూర్య, భీషణ గోషతో , సింహనాదం చేసుకుంటూ పాండవ సేనలూ నివాసములకు చేరాయి.*
తనవారి పరాజయమునకు దృతరాష్ట్రుడు పరితపించుట
ఇది విన్న దృతరాష్ట్రుడు " సంజయా ! నీవు ఎప్పుడూ పాడవుల పరాక్రమం చెప్తూ నా వారిని తక్కువ చేసి మాట్లాడుతావు. భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు యుద్ధంలో పరాక్రమం చూపడం లేదా ! అయినప్పటికి పాండవులు విజయం సాస్ధించుటకు ఏమి కారణం " అన్నాడు. సంజయుడు " ధృతరాష్ట్రా ! పాండవుల వద్ద ధర్మం, సత్యం తప్ప ఏ మంత్రం, తంత్రం, ఔషధం లేదు. నీ కుమారులు ధర్మం తప్పారు. వారు అధర్మ మార్గాన నడవడం నీకు తెలిసినా నీవు అది ఆపలేదు. ధర్మమేవజయతే అన్నది ఆర్యోక్తి కనుక పాండవుల విజయం కౌరవుల అపజయం సత్యము. విదురుడు చెప్పినది తెలుసుకదా ! నీలానే సుయోధనుడు భీష్ముని అడిగాడు. అందుకు భీష్ముడు ఏమి చెప్పాడో చిత్తగించండి " అని ఇలా చెప్ప సాగాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి