గంగా పార్వతుల వృత్తాంతములు :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
విశ్వామిత్రుడు మునులు
రామలక్ష్మణులు 
ఆ నదిలోస్నానాలు ఆచరించి 
అచట నుండి బయలుదేరినారు 
ఓ మహర్షి ఈ నాది జలములు తక్కువగా నుండి ఇసుక దిబ్బలతో ఉన్నది 

మనకు ప్రయాణానికి అనుకూలతగా ఉండదు 
ఎటు నుండి వెళ్ళుదాము స్వామి 
నాకు తెలుసు రామా వెళ్లేదారి నే చూపుతాను 
అతడు చూపిన మార్గం నుండి వారెళ్లినారు 

వారంతా చాలా దూరము ప్రయాణం చేసి 
మునులు సేవించబడు గంగానదిని దర్శించినారు 
ఆ నది హంసలతో జలపక్షులతో 
అలారారుచు అందముగా యున్నది 

వారు గంగాతీరము చేరుకొని 
అచ్చట నివాస స్థలము ఏర్పరచుకున్నారు 
మునులందరూ  స్నానమాచరించి
దేవతలకును ఋషులకును పితృగణములకు అర్పించినారు 

ఆ నది జలములను అమృతములా సేవించినారు 
గంగానది తీరమున విశ్వామిత్రుని చుట్టూరా 
మునులు రామలక్ష్మణులు కూర్చున్నారు 
మహర్షి చెప్పే మంచి మాటలు వింటున్నారు 


కామెంట్‌లు