రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో ఈర్ల సమ్మయ్యకు సన్మానం

  కరీంనగర్ కళాభారతిలో నిర్వహించిన  రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన పెద్దపెల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం  ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు ఘన సన్మానించారు .మంగళవారం  తెలంగాణ రాష్ట్ర స్థాయి లఘు చిత్ర నిర్మాతల మండలి ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు, కళాకారుడు కనపర్తి శ్రీనివాస్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి పాటల పోటీలు జరిగాయి. ఇందులో బహు భాషా గాయకుడు డాక్టర్ కె.జె ఏసుదాసు పాటలపై రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఈర్ల సమ్మయ్యను నిర్వాహకులు శాలువ, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు. రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో పాల్గొనడం గొప్ప అనుభూతిని మిగిల్చిందని ఈర్ల సమ్మయ్య తెలిపారు.
కామెంట్‌లు