శివా నీ తేజః ప్రభావముతో
పుత్రుడు కలిగినచో
ఈ లోకము తట్టుకోగలేదు
పార్వతి దేవితో కలిసి నీవు తపస్సు చేయుము
మూడు లోకాల క్షేమము కోరి తేజాన్ని నీలో నిలుపు
పరమశివుడు దేవతల మొరలు గ్రహించి
ఓ మునివర్యులారా నేను నా పార్వతి
మా తేజస్సును మాలోనే ఉంచుకుంటాము
మూడు లోకాలు సుఖంగా ఉంటాయి
ఓ మహర్షుల్లారా నా తేజస్సును ఎవరు ధరింప గలరు
మీ తేజస్సును భూదేవి ధరింప గలదు స్వామి
శివుడు తన తేజస్సును భూమిపై వదిలినాడు
ఆ తేజస్సు పర్వతములతో వనములతో కూడియున్నది
దేవతలందరూ కలిసి అగ్నిదేవునితో
నీవు వాయుదేవుడు శివతేజస్సును స్వీకరించండి
అగ్నిచే కూడిన ఆ శివ తేజస్సు
అచట శ్వేత పర్వతమై నిలిచెను
అప్పుడు అగ్ని సూర్య తేజస్సుతో
కుమారస్వామి అచట జన్మించినాడు
దేవతలు మునులు సంతోషించి
దేవతలు మునులు పార్వతీ పరమేశ్వరులను పూజించిరి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి