దేవుడిచ్చిన వరం...!!: - యెనుముల వేణుగోపాలరావు.- అమలాపురం.

 ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి 
రంగరించి ఒకపట్టు పట్టు ,
ఆ రుచి ఇక నీ జీవితంలో _
మరచిపోతే ఒట్టు ,
మిగిలిన రుచులన్నీ కూడా 
దీనిముందు తీసికట్టు !
కొత్త ఆవకాయని , కొత్త పెళ్ళాన్ని 
ఎవరైనా మరువగలరా ?
ఇది ఏ మానవ మాతృడికైన సాధ్యమా?
పోయేవాడికి చూపిస్తే 
ఈ పచ్చడి వాసన ,
వెంటనే లేచి కూర్చుంటాడు నాయనా !
పెరుగన్నంలో ఆవకాయ ముక్క 
కొరుకు ,
స్వర్గపుటంచులు వరకూ దారి దొరుకు !
కొత్త ఆవకాయ రుచి వర్ణించ గలమా ?
ఇది కవులకు సైతం సాధ్య తరమా ?
ఆహా.... ఏమి ఆ కలర్ఫుల్ రంగు,
చూస్తేనే మది ఆనందంతో ఉప్పొంగు !
ఆ పచ్చడిలో కనిపించే.. వెల్లుల్లి,
నీకు ఎంతో మేలు చేసే ఉల్లికి చెల్లి ,
నీ గుండె ఆరోగ్యం కాపాడే తల్లి ,
ఇది తింటే నీ మనసు 
పడుతుంది తుళ్ళి , తుళ్ళి!
ఆవకాయ లో కలబోసిన 
నువ్వుల నూనె _
వర్ణించగలమా ? ఆ కమ్మని రుచి,
తినకుండా ఉండగలమా ? గమ్మున !
శాఖాహారులకు ఇది వరప్రసాదం ,
అందులో పప్పు జోడిస్తే ఆరుచి అమోఘం !
ఆవకాయ పచ్చడి తిననివాడు ,
ఆరుబయట హాయిగా పడుకోనివాడు 
ఉన్నా... లేనట్టే కదా...!
అచ్చ తెలుగు ఆవకాయ పచ్చడి,
పాత తరానికి దేవుడిచ్చిన వరం !
నేటి తరంవారు తింటే _
(హై బీ పీ లతో) 
దేవుడి పైనే మరి భారం!!
                   +++

కామెంట్‌లు