ఆశల పందిరికి
ఆధారమైనా...
ఊహల ఉయ్యాలలూపే
ఊపిరికైనా..
కన్నులు కన్న కమ్మని
కలలకైనా...
వన్నెల వెల్లువ చిందే
చిన్నెలకైనా...
మనసున దాగిన
మాటకైనా....
తలపున దాచిన
ముచ్చటకైనా.....
పెదవులు పలకని
పిలుపుకైనా....
హృదయపు వాకిట
వేచిన మమతకైనా....
గుండెలోని పెక్కు
పోరల అడుగున...
పాతర వేసిన పచ్చని
ప్రేమకైనా...
తడిగా గొంతును
అపుడపుడు....తడిమే
విడిగా మనసును
వదలని జ్ఞాపకానికైనా...
కోటి భావనలు మీటే
లక్ష కామనలు వినే
వేయి కలతలు బాపే
నూరు వత్సరాల తోడైన
వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి