సుప్రభాత కవిత : - బృంద
చీకటి పడగానే 
మేలుకుని మనసును 
వెంటాడి వేటాడే 
వేదనల వెతలన్నిటికీ....

వదిలేసిన అవకాశాలకన్నా 
మెరుగైన తరుణం కోసం 
చురుకైన యోచన చేసే 
తెలివైన ఆలోచనలకు....

తలచినంతనే స్ఫూర్తి కలిగి 
కలతలన్నీ మరచిపోయి 
భవిత గురించి ఆలోచనలు 
రూపొందించుకునే ఊహలకు

గుండెలోని దిగుళ్లను
గుర్తుచేసుకుని నిట్టూర్చి 
మంచిరోజులు వచ్చి తీరునని 
గట్టిగా అనుకునే ఆశలకు..

వెలుతురు ఒక్కటే ఆధారం 
వెలుగుల ఉదయమే ఉత్సాహం 
వేచిన ఎదల ఎదురుచూపులకు 
వేకువ  ఒక్కటే  సమాధానం!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు