జలం లేనిదే మనం లేము
జలం లేనిదే జగం లేదు..
సమస్త ప్రాణికోటికి
జీవాధారం జలం
భావి తరాల భవితకు
ప్రాణాధారం జలం
జనం నిర్లక్ష్యం తో వృధాతో
మండుటెండలో లో
తడి ఆరిన గొంతులెన్నో
గుక్క నీటికై
మైళ్ళ దూరాల పరుగులు ఎన్నో
నీరు దొరకక కన్నీటితో
తడిచిన భూములు ఎన్నో
ఆక్రమించిన కట్టడాలక్రింద
భూస్థాపితం అయిన పచ్చదనాలు
కనుమరుగైన అడవులు
కాలుష్యపు కొరలలో
కానరాని ప్రకృతి అందాలు
ఒంటిని తడిపే చెమట చుక్కలు
మనసును తడిపే కంటి చెమ్మలు తప్ప
ఎడారిలో ఓయాసిస్సు లామారి
గొంతును తడపని నీటి చుక్కలు..
కాలం ఏదైనా
జలం లేనిదే మనం లేము
జలం లేనిదే జగం లేదు...
అందుకే విజ్ఞతతో మేల్కొందాం
నీటి వనరులను రక్షిద్దాం..
ఇంకుడు గుంతలు నిర్మిద్దాం
వర్షపు నీటిని ఒడిసి పడదాం
భూగర్భ జలాలను సంరక్షిద్దాం
భావితరాల భవితను కాపాడుదాం..
ఒక్కో నీటి బొట్టు వందేళ్ల జీవితం
అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేద్దాం..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి