వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
98. సమయాచార తత్పరా (అష్టాక్షరీ)
99. మూలాధారైకనిలయా (అష్టాక్షరీ)
తొంభై తొమ్మిదవ నామ మంత్రము -
ఓం మూలాధారైకనిలయాయై నమః
సుషుమ్న నాడి మొదలు అయ్యే మూలస్థానములో ఉన్న నాలుగు దళముల పద్మము మధ్యలో దర్శనమిచ్చిన అమ్మవారు శ్రీమాతను చూసి వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "మూలాధారైకనిలయా" అని కీర్తించారు. మూలాధారములో నిలిచి ఉన్న పరమేశ్వరికి నమస్కారము.
మూలాధార చక్రము, మానవ శరీరం లో గుద స్థానము పైన, లింగ స్థానమునకు క్రిందుగా ఉంటుంది. శ్రీవద్యోపాసనలో చెప్పబడి, మానవశరీరం లో వున్న ఆరు చక్రాలలో "మూలాధార చక్రము" మొదటిది. ఈ మూలాధార చక్రములో ఉన్న నాలుగు దళములకూ ప, శ, ష, స అనే అక్షరముల అధిదేవతలుగా వరదా, శ్రీ,, షండా, సరస్వతి ఉన్నారు. మధ్యలో "సాకినీ స్వరూపిణి" అయిన జగన్మాత విరాజిల్లతూ ఉంటుంది. సాకినీ దేవిని, "సిద్ధవిద్యా దేవి" అని కూడా కీర్తిస్తారు.
ఈ మూలాధార చక్రము నకు అధిదేవత "గణపతి ". బీజ మంత్రము, "లం".
ఈ మూలాధార చక్రము మధ్యలో వున్న త్రికణంలో, లింగ రూపంలో మహేశ్వరుడు స్థిరంగా ఉన్నాడు. ఈ లింగ రుపాన్ని మూడున్నర చుట్లలో చుట్టుకుని ఉంటుంది "కుండలినీ శక్తి". మూలాధార చక్రము లో ఉన్న నాలుగు దళముల పద్మము ఎర్రటి రంగులో ఉంటుంది. ఈ నాలుగు దళముల మధ్యలో జగన్మాత ముఖమును కప్పుకుని పడుకుని ఉంటుంది. అందువల్లనే శ్రీమహారాజ్ని "మూలాధారైకనిలయా" అయ్యింది.
ప్రతీ మానవుని శరీరంలో మూలాధార చక్రము లో"కుండలినీ శక్తి నిద్రాణంగా ఉంటుంది. ఈ కారణంచేత, మానవుడు అజ్నాము అనే అంధకారంలో చిక్కుకుని, నేను, నాది అనుకుంటూ, ప్రాపంచిక, పాంచభౌతిక ఆకర్షణలకు లొంగిపోయి ఉంటాడు. పరమేశ్వరి ఆదరణతో, అనుగ్రహంతో ఈ పాంచభౌతిక ప్రాపంచిక విషయాలు శాశ్వతాలు కావు అని తెలుసుకుంటాడు. ఈ స్థితిలో, ఆ సాధకుని తన వద్దకు పిలిపించుకుంటాడు, సిద్ధపురుషుడైన సద్గురువు. ఆ సద్గురువు పరమేశ్వరి ప్రేరణతో, తన వద్దకు వచ్చిన సాధకునకు, జ్ఞాన శక్తిని జాగృతం చేయడం వలన యోగసాధన మొదలు పెట్టి, తన దృష్టి ని గణపతి అధిదేవత గా ఉన్న, మొట్టమొదటి మూలాధార చక్రము లో కుండలినీ శక్తిని తట్టి లేపుతాడు. షట్చక్రములలో మూలాధార చక్రము మొదటిది. అందువల్ల ఇక్కడ ఉన్న పరమేశ్వరి "మూలాధారైకనిలయా" అని పిలువబడుతుంది.
ఇలా మూలాధార చక్రము లో ఉన్న త్రికోణం లో మూడున్నర చుట్లలో తల క్రిదికి ఉంచుకుని ఉన్న తనను, ఏ సాధకుడు తన సాధన ద్వారా సాధించాలనీ, తనను చేరుకోవాలి అని సాధన చేసే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం మూలాధారైకనిలయాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి