14వ సర్గ : - ఎడ్ల లక్ష్మి- సిద్ధిపేట
శ్రీరాముని తీసుకొని వచ్చుటకు కైకేయి సుమంతుని ఆదేశించుట 
-----------------------


 

బోయలు మోయుచున్న పల్లకిని 
చంద్రుని వలె తెల్లనైన గొడుగును 
బంగారు గొలుసులతో అలంకరించిన 
మూపురముగల తెల్లని వృషభము

సింహాసనము, పులి చర్మము ప్రజ్వలితాగ్ని 
మృదంగతాళవాద్య సమూహములు 
ఆచార్యులైన పూజ్య బ్రాహ్మణులు 
పవిత్రమైన గోవులు, మృగములు, పక్షులు 
అన్ని తెచ్చినటుల రాజుకు తెలుపుము

సుమంత్రుడు దశరథుని వద్దకు వెళ్ళినాడు
దశరథుని చూసి ఎంతగానో పొగిడినాడు 
ఓ మహారాజా త్వరగా మేలుకొనుము 
అతని మాటలిని కైకేయి వేతెంచినది

సుమంత్రుడా రామునిటు తీసుకు రమ్ము
దశరథుని ఆజ్ఞ లేనిది వెళ్లలేను 
దశరథుడు ఓ సుమంత్రుడా నీవు వెళ్ళు 
రాముని ముఖము చూడాలని ఉంది 

కైకేయి రాముని పట్టాభిషేకం కై చూస్తుంది 
సంతోషంతో రాముని వద్దకు పంపిస్తుందని
సుమంత్రుడు మంచి యోచనతో 
అంతఃపురం నుండి బయలుదేరినాడు 

కామెంట్‌లు