రాష్ట్రస్థాయి కవితా పోటీలో తాండూరు కవికి మొదటి బహుమతి: వెంకట్ , మొలక ప్రతినిధి

 తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ నామోజు బాలాచారి ఆధ్వర్యంలో తేదీ 26/06/2026న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన "మనశ్శాంతి – జీవనకాంతి" రాష్ట్రస్థాయి కవితా పోటీలో వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన కవి, తెలుగు ఉపాధ్యాయులు జె. రామకృష్ణరాజు మొదటి బహుమతిని సాధించారు.
"మనశ్శాంతి – జీవనకాంతి" అనే అంశంపై మానవ హైజీనిక్ ఆలోచనలతో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో జె. రామకృష్ణరాజు రచించిన కవిత న్యాయనిర్ణేతలను ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ నందిని సిద్ధారెడ్డి చేతుల మీదుగా ఆయనకు నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ఈ విజయం పట్ల యాలాల మండల విద్యాశాఖాధికారి శ్రీ ముజాహిల్ రెడ్డి, తాండూరు కన్వీనర్ కోటం చంద్రశేఖర్, ద్వావరి నరేందర్ రెడ్డి, గాజుల పవన్ కుమార్, కవయిత్రి  మొల్ల కళావేదిక  KVM వెంకట్ , సాహిత్యవేత్తలు, ఉపాధ్యాయులు, కవులు, సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ జె. రామకృష్ణరాజును అభినందించారు. భవిష్యత్తులోనూ ఆయన సాహిత్య రంగంలో మరిన్ని విశిష్ట రచనలు అందించాలని ఆకాంక్షించారు.
కామెంట్‌లు