14వ సర్గ : - ఎడ్ల లక్ష్మి- సిద్ధిపేట
వశిష్ఠాధులు రాజదర్శనమునకు విచ్చేయుట 
------------------

\

 

పట్టాభిషేక ముహూర్తము దగ్గర పడగా 
వశిష్ట మహర్షి తన శిష్యులతో గూడి
అభిషేక సామాగ్రిని సమకూర్చుకొని 
అయోధ్య నగరంలోకి ప్రవేశించెను 

నగరవీధులన్నీ ముత్యాలముగ్గులతో 
తోరణాల పందిళ్ళతో అందంగా ఉన్నాయి 
రాముని పట్టాభిషేకము చూచుటకై 
నగర ప్రజలంతా ఎదురుచూపులు 

వశిష్టమహర్షి మునులతో గూడి
అంతఃపురమునకు చేరినారు 
దశరథ రథసారథి సుమంత్రుడు 
వారికి ఎదురెళ్లి స్వాగతం పలికినాడు

ఓ సుమంత్రుడా రామ పట్టాభిషేకముకై  
బంగారు జలకలశములను పాలు, పెరుగు 
తేనెలు, నేతులు, పుష్పాలు తీసుకొని 
మేమొచ్చినటుల దశరథునకు వివరించు 

అందమైన ఎనిమిది మంది కన్యలను 
మదించిన భద్రగజం నాలుగు గుర్రములు
కట్టినట్టే అందమైన రథమును 
రాజాఖడ్గము మేలైన ధనస్సు తెచ్చాము 

కామెంట్‌లు