ప్రవాస పద్య పరిమళం - 15: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA

నేటి అంశం : చిత్రానికి పద్యం
ఛందస్సు : మత్తేభము 

తడబాటేమరుపాటు లేమి గని  తాదాత్మ్యమ్ము నీ తల్లికిన్ 
బడిలో బుద్ధిగ పాఠముల్జదివి  తా వల్లించగా మోదమున్ 
వడిగా నింటికి చేరగా దుహిత యా వాగ్దేవి వర్చస్సు తో
కడు వాత్సల్య పు కౌగిటన్ మురిసె నే   గర్వాతిరేకమ్మునన్

తడబాటేమరుపాటు లేమి = తడబాటు ఏమరు పాటు లేకుండా 
దుహిత = కూతురు 
వాగ్దేవి = సరస్వతి 
వర్చస్సు = తేజస్సు 

కామెంట్‌లు