డా.నాగసూరివేణుగోపాల్ _సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
శ్రీనాగసూరిగారు 2016లో తిరుపతిఆకాశవాణికి వెళ్లాక ప్రతిశుక్రవారం తోటపని చేయటం,అన్నమయ్య చిత్ర పటంని ఆనాటి ప్రసారభారతిఛైర్మన్ డా.ఎ.సూర్యప్రకాశ్ గారితో ఆవిష్కరింపజేయటం ఒక ఎత్తు. ఆప్రాంతప్రముఖుల ఫోటోలను ఆర్.వెంకటేశ్వర్లుగారిని సంప్రదించి స్టూడియోలో అలంకరించినప్పుడు మిట్టపల్లి విశ్వనాథ రెడ్డి గారు రూపొందించిన వాటికి రైటప్ రాశారు.వాటిలో కొందరిని గూర్చి తెల్సుకుందాం.లీలానాయుడు 1940_28.7.2009లో బాంబేలో చనిపోయారు.ఆమె తండ్రి మదనపల్లెకి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ పత్తిపాటిరమేష్ నాయుడు మేడంక్యూరీతో కల్సి పరిశోధన చేశారు.ఆయన భార్య స్విస్ ఫ్రెంచ్ వనిత మార్తె మాంగే నాయుడు.వారికుమార్తె లీలానాయుడు ప్రపంచ సుందరీమణులలో ఒకరు.అందం నటనతో హిందీ ఆంగ్ల సినిమాల్లో రాణించారు.ఎం.వి.పాపన్నగుప్త(12.6.1905_1.1.1986) స్వాతంత్య్ర సమరయోధులు.హైమవతి అనే కథను,భానుమతి అనే నవలను రాసిన తొలి ఆధునిక చిత్తూరు జిల్లా రచయిత. పాలసేకరణ,బ్యాంకుల వ్యాప్తి, స్త్రీలవిద్య మొదలైన వాటికై కృషిచేశారు. జిల్లా అధికారి ఉద్యోగంని వదిలి విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్న మహామనీషి.జోళెపాలెం మంగమ్మ 12.9.1925_1.2.2017) ఢిల్లీనుంచి ఆకాశ వాణి వార్తలు చదివేవారు.మహిళల అభ్యున్నతి గ్రామీణ చైతన్యంకోసం పాటుపడ్డారు.టి.జి.కమలాదేవి(29.12.1930_15.12.2012) నాటకాల్లో సినిమాల్లో నటి,గాయని,డబ్బింగ్ కళాకారిణిగా వెలిగారు. ఆమె అసలుపేరు తోట గోవిందమ్మ. బిలియర్డ్స్ లో జాతీయ స్థాయిలో పేరు పొందారు.ఇంకాచిత్తూరునాగయ్య, ఆర్.ఎస్.సుదర్శనం,శంకరంబాడి సుందరాచారి,కె.సభా,మాడభూషి అనంత శయనం అయ్యంగార్,జిడ్డు కృష్ణమూర్తి,కట్టమంచి రామలింగారెడ్డి,సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాలు స్ఫూర్తిదాతలుగా నిలిచాయి.ఇక్కడ ఒక విషయం చెప్పాలి.జననం మరణం అనే పదాలు వాడకుండా వేణుగోపాల్ గారు కనువెలుగు,కనుమరుగు అనే పదాల్ని వాడటం ప్రత్యేకతను సంతరించుకుంది.డా.అంగళకుర్తి విద్యాసాగర్ గారు శ్రీనాగసూరిగారు 30జనవరి 2021న రిటైరైనప్పుడు వీడ్కోలు వీడ్కోలువ్యాసం రాశారు.అందులో కొన్ని ముఖ్య వాక్యాలు ఇవి" నాగసూరి గారి జీవితంలో కవిత్వం ఉంది.ఆకవిత్వం పేరు శ్రీమతిహంస! నాగసూరి సుతారంగా తిరిగేటి భరణి.దాని అర్ధం ఆసులో దారపుకండి." నిరంతర పఠనం,శోధన, సాహిత్యం,సైన్స్ కలబోసిన ప్రజ్ఞా ప్రతిభాశాలి.ఆకాశ వాణికి సొబగులు కూర్చి కొత్త బాటలు వేశారు.మరి నేడు ఆకాశ వాణి 90వసంతాల పండగ సందర్భంగా ఈపుస్తకాన్ని ప్రతివారు తప్పక చదివి తీరాలి.
ఒక నవల కథ ఇవ్వని థ్రిల్,ఆసక్తి కలిగిస్తుంది. మొత్తం 224పేజీలున్న సిగ్నేచర్ ట్యూన్ ఆకాశవాణికి అమూల్యమైన కానుక.
ఈపుస్తకంలో విషయాలను క్లుప్తంగా కుదించి రాశాను.అడగగానే అనుమతించిన శ్రీనాగసూరివేణుగోపాల్ గారికి నాహృదయపూర్వక ధన్యవాదాలు .ఎంతో ఓపికగా నేను ఏది రాస్తానన్నా*నో* అనకుండా రాయమని ప్రోత్సహించిన
=====================================================================
,రోజూ మొలకలో ప్రచురించిన శ్రీ వేదాంత సూరిగారికి నాహృదయపూర్వక కృతజ్ఞత లు🙏రాజ్యశ్రీ🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి