డా.కె.జానకిగారిRoleof women in freedom struggle in Andhra Pradesh
మంతెన అన్నపూర్ణాదేవి1912లో పుట్టారు.అమ్మ నాన్నలు సుబ్బాయమ్మ, కుటుంబరాజు. భర్త వెంకట రాజు.మంతెనవారిపాలెం రాజకీయాల్లో ముందుండేది. వేసవిలో రాజకీయ శిక్షణాశిబిరం నడిచేది.1921_22లో ఆమె కాంగ్రెస్ కార్యకర్త గా స్వాతంత్య్ర సమరయోధులతో భేటీ అయ్యేది.ఆమె ఇల్లంతా వారితో సందడిగా ఉండేది.ఖాదీ ప్రచారంచేస్తూ పికెటింగ్ లో పాల్గొన్నందుకు లాఠీదెబ్బలు తిని జైలుశిక్ష అనుభవించారామె.చేతిలో పసిపాప, 3ఏళ్ల బాబుతో ఒంటరిపోరాటం చేశారామె.భర్త జైల్లో ఉన్నప్పుడు తమ ఇంట ఉన్న దేశ సేవకుల మంచిచెడ్డలు చూశారు.1937లో ఒంగోలు జిల్లాబోర్డుకి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.1984లో కన్నుమూశారు.ఇంట్లో లైబ్రరీ ఏర్పాటుచేసిన ఆదంపతులు దేశ పరిస్థితులపై అవగాహన కలిగించి స్వాతంత్య్ర పోరాటంకై సిద్ధపరిచారు.సూర్య దేవర అన్నపూర్ణమ్మ గారు1903 లో కృష్ణాజిల్లాలోని వీర్లుపాడులో జన్మించారు.కానీ చేబ్రోలులో నివాసం! తండ్రి వాసిరెడ్డినాగయ్య ,భర్త వెంకటప్పయ్య. ఘోషా అవలంబించే కుటుంబం ఐనా ఆమె ఉప్పుసత్యాగ్రహంమొదలు అన్ని పోరాటాలలో పాల్గొన్నారు.50రూ.ఫైన్ ,వెల్లూరు,కన్ననూర్ జైలుశిక్ష అనుభవించారు.1947_48లోజాయిన్ ఇండియన్ యూనియన్ మూవ్ మెంట్ లో చురుకైన పాత్ర పోషించారు.హిందీ,గ్రంథాలయ ఏర్పాట్లపై ప్రచారం చేసిన అసలు సిసలు గాంధేయ వాది.బాలికల కోసం ఫ్రీస్కూళ్లను రంగనాయకునిపాలెం,వీరులపాడు నెలకొల్పారు.కృష్ణాజిల్లా బోర్డ్ మెంబర్ గా,జిల్లాపరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు అన్నపూర్ణమ్మ గారు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి