హైదరాబాద్ లో సోమన్న "శతమానం భవతి " పుస్తకావిష్కరణ వచ్చే 5 న
 

నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న వందవ (100 )పుస్తకం "శతమానం భవతి " పుస్తకావిష్కరణ  జూలై 5,2026న హైదరాబాద్ లో జరుగనుంది. సోమన్న ఈ వందో పుస్తకాన్ని  పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు ఆవిష్కరిస్తారు. అనంతరం బాలసాహిత్యంలో వీరి విశేష కృషికి గాను "బాల గేయ బ్రహ్మ" బిరుదుతో  సంగీత సాహిత్య సాంస్కృతిక సమన్వయ సంస్థ, హైదరాబాద్ తగురీతిగా  సత్కరిస్తారని కవి గద్వాల సోమన్న ఓ ప్రకటనలో తెలిపారు.
కామెంట్‌లు