చిలుకమ్మ: - బట్టల హారిక -7వ,తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-బక్రిచెప్యాల జిల్లా సిద్దిపేట
చిలుకమ్మ చిలుక
అందమైన చిలుక 
పచ్చ పచ్చని చిలుక
పరువాల చిలుక
అందరికి ఇష్టమైన
మా రామచిలుక
చిన్ని చిన్ని చిలుక
చిట్టి రామచిలుక 
ముక్కేమొ ఎర్రన
కంఠమేమొ నల్లన
గగనానికి ఎగురును 
షికారెంతోచేయును 
కిలకిలమని అరుచును 
జాతకాలు చూచును
పంజరంలో చిలుకకు
స్వేచ్ఛ లేకుండెను
దోరజామ పండును
కొరికి కొరికి తినును
ఇష్టమైన చిలుకమ్మ
మా ఇంటికి రావమ్మా



కామెంట్‌లు