పేకాట: - పెంబర్ల కిశోర్ -8వ, తరగతి.-జిపఉపా: బక్రిచెప్యాల -జిల్లా సిద్దిపేట-9704865816
 రాంపూర్ అనే ఊరిలో ప్రాథమిక పాఠశాల ఉంది. పైచదువులు  పాలమాకుల పాఠశాలకు వెళ్లి చదువుకునేవారు.ఐదుగురు  స్నేహితులు కలిసి పాలమాకుల బడికి వెళ్లేవారు.చెరువు కట్ట కింద పదిమంది కాలేజి విద్యార్థులు పేకాట ఆడుచున్నారు.
మొదటగా రవి అనే పిల్లవాడు వీళ్ళ పేకాటను గమనించాడు.మెల్లమెల్లగా ఆట నేర్చుకున్నాడు.బడికి వెళ్లడంలేదు.
మిగతా స్నేహితులు ఒరేయ్ రవి ఈ పేకాట మంచిది కాదురా బడికి వెళ్దాము అని అంటారు.
మీకు తెలవదు రా! దీనిలో ఉన్న మజానేవేరు.
చాలా మంచిగ ఉంటుంది.
రండిరా మీరు ఆడుదురు బలవంతంగా ఆట నేర్పుతాడు.ఒకవేళ గెలిస్తే మనకు చాలాడబ్బులు వస్తాయిరాఅని రవి అంటాడు.ఇకనుండి మీరు కూడా మీ ఇంట్లో అమ్మా నాన్న నడిగి డబ్బులు తీసుకరండి అని చెబుతాడు.మా ఇంట్లో నుండి నేను 500 తెచ్చుకున్నారా! మీరు కూడా తెచ్చుకోండి. మంచిగా రోజు ఆడుదాం. మంచిగ ఎంజాయ్ చేద్దాం రా! అని రవి అంటాడు.
రవి వాళ్ళ అమ్మ రోజు డబ్బులు తీసికెళ్తున్నాడు.ఏంచేస్తున్నాడని అమ్మకు అనుమానం ఎక్కువైంది.
ఒకరోజు వీళ్ళకు తెలియకుండా అమ్మ బడికి వెళుతుంది.రవి బడిలో లేడు.తిరిగి వస్తుండగా వీరు కట్టకింది పేకాట ఆడుతున్నారు.అప్పుడు వీళ్ళ అమ్మ చూస్తుంది.
వీళ్ళ సంగతి గిట్ల ఉందా అని రాజగోపాల్ పేటకు పోతుంది. పోలీసులను తీసుకొని వస్తుంది.పోలీసులు వీళ్ళందర్నీ పట్టుకుంటారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. అప్పుడు పేకాట వలన నష్టాల గూర్చి వివరించి చెప్తారు. పేకాట ఎక్కువైతే మీరు దొంగతనాలు చేస్తారు. చదువు పాడౌతుంది.దొంగలుగా మారుతారు.మీ భవిష్యత్తు నాశనం చేసుకోకూడదు.మీరు బాగా చదువుకోవాలి. అందరికి మంచి మాటలు చెబుతారు.పిల్లలందరూ నిజాలను తెలుసుకుంటారు. ఇప్పటి నుంచి మేము పేకాట ఆడము అని ప్రమాణం చేస్తారు.ఇంటికి వస్తారు.అప్పటి నుంచి క్రమశిక్షణగా బడికి వెళ్లి చదువుకొని గొప్పవారిగా తయారవుతారు.
.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం