మధుర స్వప్నం: - పులి జమున- తెలుగు భాషోపాధ్యాయిని-జి.ప.ఉ.పాఠశాల, గార్లపహాడ్-8500169682.
జీవితంలో బాల్యం అపురూపమైనది
మరువలేని మరపురాని మధురస్వప్నం 
ఆనందంగా చిందులు వేస్తూ
సీతాకోకచిలుకల్లా హాయిగా ఎగరుతూ
వానజల్లుల్లో ఉల్లాసంగా గెంతులువేస్తూ
పడుతూ లేస్తూ పరుగులు పెడతూ
సంతోషాలను  స్వంతం చేసుకునే బాల్యం. 
                       
వచ్చీరానీ చిలుక పలుకులతో
బుడిబుడి నడకలతో మురిపిస్తూ 
నట్టింట్లో నడయాడే పిల్లలుంటే
ఇల్లే ఒక నందనవనమవుతుంది
                          

అనురాగంతో అల్లుకుపోయే ప్రేమలతలై
మూగబోయిన మనసును మురిపిస్తూనే
ముసిముసినవ్వులతో ముచ్చట గొల్పుతూ
మనోల్లాస సమీరమై సేదతీర్చే మాలికలు పిల్లలు

మకరందపు తేనియలై మదిని తట్టి
ఆటపాటలతో ఆనంద డోలికలూపి
స్వేచ్చగా రివ్వున ఎగిరే గువ్వలై
సరికొత్త ప్రపంచమునే సృజియించే పిల్లలు
                          

              

కామెంట్‌లు