మార్పు: -బట్టల సాయిచరణ్-9వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -జిల్లా సిద్ధిపేట.-9704865816.



రామునిపట్లగ్రామంలో రమేష్  ఉన్నాడు.రోజు అడడికి వెళ్లి చెట్లు నరికి ఇటుక బట్టీలకు మొద్దులు  అమ్మేవాడు.
కొన్నాళ్లకు అడవి ఖాళీ ఐంది.వచ్చిన డబ్బులతో సిగరేట్లు,బీడీలు,పాన్ పరాగులు,గుట్కాలుతింటూ, తాగుడుకు బానిసైనాడు.
వాళ్ళ కూతురు రజితకు చెట్లంటే ప్రాణం.
ఇంటిపెరటిలో,గ్రామంలో, ఖాళీస్థలాల్లో చెట్లను నాటి రోజు నీరు పోసి పెంచసాగేది.ఆవిధంగా గ్రామంలో విపరీతంగా చెట్లనునాటింది.తండ్రితో కలిసి ఉండడం వలన భార్యలక్ష్మి,కూతురు రజిత సిగరేట్ల పొగ,గుట్కాలవాసన పీల్చుకోవడం వలన అనారోగ్యాల పాలయ్యారు.ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆసుపత్రికి వెళ్లి ఇద్దరికి పరీక్షలు చేయించాడు.రోజు తండ్రి తాగే ధూమపానం పీల్చుకోవడం వల్ల కూతురికి క్యాన్సర్ జబ్బు వచ్చింది.
భార్య లక్ష్మికీ  టీబీ వచ్చింది.తండ్రి ఎంతో కృంగిపోయాడు.ఇవన్నింటికి కారణం నేనే అని తనలో తానే బాధపడినాడు.
అప్పటినుండి చెట్లను కొట్టడం బంద్ చేసి రాత్రి ,పగలనక హమాలి పని చేసి డబ్బులు సంపాదించేవాడు.వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు.లక్ష్మి కూతురు పెట్టిన చెట్ల నుంచి పూలు,పండ్లు తెంపి వ్యాపారం చేసుకుంటూ కూతురును చదివించసాగింది.కూతురు మంచి ప్రయోజకురాలై ఉద్యోగం సంపాదించుకుంది.
అప్పుడు అమ్మానాన్నలను కష్టపడకుండా చూసుకోగలిగింది.
కామెంట్‌లు