పేపరు: - డీకొండ శ్రావణి -9వ,తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల జిల్లా సిద్దిపేట
 పొద్దున నేను లేచాను
మంచిగ తయారు అయ్యాను 
త్వరగా బడికి వచ్చాను
తెల్ల పేపరు తీశాను 
పెన్సిల్ చేతుల పట్టాను 
అక్షరాలను రాశాను 
గుండ్రంగా అవి కుదరకుంటే 
గురువుగారికి చూపాను 
వాటిని అన్ని సవరించారు 
చక్కని రాతలు నేర్చాను 
గురువులు నన్ను మెచ్చారు 
అమ్మానాన్నలు దీవించారు.

కామెంట్‌లు