కోరిక : - - రామగిరి భీష్మాచారి -9030200139

 భూమిపై జీవించే 
ప్రతి మనిషి 
ఆనందంగా 
జీవించాలని 
కోరుకుంటాడు 
కోరికలకు బానిసై 
విలాసవంతమైన 
జీవితానికి 
అలవాటు పడి 
తనను తాను 
మరిచిపోతాడు 
తీరని కోరికలతో 
అగాధంలో 
కూరుకుపోయి 
కోరికలే శత్రువులై 
బుద్ధి జ్ఞానం 
ఓర్పు సహనం 
కోల్పోతాడు 
నిస్సహాయ స్థితిలో 
కొట్టుమిట్టాడుతాడు 
అందుకే 
తుచ్చమైన 
కోరికల జోలికి 
వెళ్లకుండా 
మనసును బుద్ధిని 
అదుపులో పెట్టుకోవాలి 
ఓర్పు సహనంతో 
జీవన గమనంలో 
ముందుకు సాగాలి 
******
కామెంట్‌లు