వైద్యుడు నారాయణుడు (కసాయోడుకాదు): అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497


వైద్యుడు నారాయణుడే 
కానీ 
నేడు వైద్యం కార్పోరేట్ల కబంధ హస్తాల్లో బంధీయైనది

ప్రాణాలను నిలబెట్టెవాడు
వర్తకవ్యాపారయ్యాడు
కన్నుకింత
కాలుకింత
గుండెకింత
ఊపిరితిత్తులకింత
అంటూ లెక్కలుకట్టి వైద్యాన్ని 
అంగడివస్తువుగా మార్చారు

మెడికల్ మాఫియా తనపంజావిసిరి
మహమ్మారి కరోనా లాంటి వైరస్ విజృంభించిన సమయాన వందల రకాల 
మెడికల్ కంపెనీలు మందులు టీకాల్లు తయారు చేసి వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు 

ఈ కార్పోరేట్ వైద్యాలయాల్లో
జరిగే శస్త్ర చికిత్సల లైవ్ రికార్డు రోగితరపు బంధువులకు అందించాలి
వైద్యుడు చేయుతప్పిదాలు తేటతెల్లం చేయాలి 

వైద్యుడు కరుణామయుడు కావాలి కానీ 
కసాయోడు కాకూడదు కదా!
 
ఇటు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు నిపుణులైనవైద్యులచే పర్యవేక్షణ బృందాన్నేర్పర్చి
వైద్యుల వైద్య కౌశలాన్ని అనునిత్యం అంచనా వేయాలి

అవసరానికి మించి మందులు మాత్రలు అమ్మకంచేయు డ్రగ్ మాఫియా ఆగడాలపై కొరడా ఝళిపించాలి
అఖిల భారత వైద్య విధానపరిషత్తు ఉదాసీనవైఖరే మెడికల్ మాఫియాకు ఆయువుపట్టు కాకూడదు

వైద్యుడు నారాయణుడవ్వాలి
వైద్యం ప్రజావైద్యమై వర్థిల్లాలి
ప్రజారోగ్యం ప్రభుత్వాల ప్రథమకర్తవ్యమవ్వాలి
(ఉత్తమోత్తమ ప్రజావైద్యులకు జేజేలు) 

కామెంట్‌లు