అమ్మమ్మ: - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు-సిద్ధిపేట -9704865816
అమ్మమ్మ ఇచ్చును 
బోలెడన్ని ముద్దులు 
ఆకలవుతుందంటే 
అరిసెలు చేసిచ్చును

ఆటలాడు కుంటమంటె 
బ్యాటు బాలు ఇచ్చును 
జేబు నిండ పుట్నాలు 
నింపి మమ్ము పంపును

రాత్రి నిద్ర పట్టకుంటే 
నీతికథలు చెప్పును 
నిద్రించ వరకు మాకు 
జోల పాటలు పాడును.

అమ్మమ్మ మాటలు 
అమృతంపు మూటలు 
అమ్మమ్మ మనసు 
 వెన్న కన్న మెత్తన

తాతయ్య కన్న నన్ను 
మిన్న గాను చూచును 
దాచిపెట్టిన డబ్బులన్ని 
చాటుగా మాకిచ్చును.


కామెంట్‌లు
Popular posts