అమ్మ నోట ఆణిముత్యాలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
వదలాలి ఏమరుపాటు 
లేకుంటే గ్రహపాటు 
జీవితాన అవసరమే 
ముందు చూపు ముఖ్యమే 

ఉంటేనే క్రమశిక్షణ 
చిన్నారుల సంరక్షణ 
అభివృద్ధి సునాయాసము 
నాట్యమాడు సుభిక్షము 

ఆపదలో సహాయము 
అందించుటే సముచితము 
చేయరాదు అన్యాయము 
తలపెట్టకు అపకారము 

చేతనైతే ఉపయోగము 
అక్కరలో సహకారము 
ఉండడమే ఉత్తమము 
అందరికి ఉపయుక్తము 


కామెంట్‌లు