దిద్దుబాటు అవసరం : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
పొరపాట్లు  సహజమే 
అది మానవ నైజమే 
దిద్దుకుంటే ఘనులు 
గౌరవానికర్హులు 

తెలిసి తెలిసి తప్పులు 
చేస్తేనే తిప్పలు 
పునరావృతం వద్దు 
అశ్రద్ధ చేయొద్దు 

అందరితో మంచిగా 
నలుగురికి స్ఫూర్తిగా 
ఉండాలి బ్రతుకులో 
అందనంత ఎత్తుగా 

కలవాలి హృదయాలు 
నిలవాలి స్నేహాలు 
శ్రేష్టమైన బుద్ధితో 
మెలగాలి శ్రద్ధతో 


కామెంట్‌లు