గిరి పురములో అల్వీర్ అనే బాలుడు ఉండేవాడు .అతను ధనిక కుటుంబానికి చెందినవాడు. అదే ఊరిలో రాము అనే పేద కుటుంబానికి చెందిన బాలుడు ఉన్నాడు. ఆ ఇద్దరు బాలురు ఒకే పాఠశాలలో చదివేవారు రాము చాలా తెలివైనవాడు. కానీ బడికి సాధారణ దుస్తులతో వచ్చేవాడు కొందరు విద్యార్థులు అతన్ని చూసి నవ్వేవారు అల్వీర్ కూడా మొదట అతన్ని పట్టించుకునే వాడు కాదు ఒకరోజు పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు పాఠం చెప్పిన తర్వాత ప్రాజెక్టు పనిని చేసుక రమ్మని తెల్పారు. అందరూ జంటలుగా పనిచేయాలని చెప్పారు .అల్వీర్ కు ఎవరు జోడి కాలేకపోయారు, చివరికి రాము అతని జంటగా అయ్యారు. మొదట అల్వీర్ కు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు రాము చాలా తెలివైన బాలుడు కావున శ్రద్ధగా పట్టుదలతో పని చేయడం ప్రారంభించాడు. అతని ఆలోచనలు చాలా మంచివి అల్వీర్ కూడా అతనితో కలిసిపోయాడు. ఇద్దరు కలిసి మంచి ప్రాజెక్టు తయారు చేశారు ఫలితాలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాజెక్టుకు మొదటి బహుమతి లభిచింది. ఆ సమయములో ఉపాధ్యాయురాలు రాము తెలివిని ప్రశంసించారు అల్వీర్ కూడా తన తప్పు తెలుసుకున్నాడు డబ్బు కాదు ముఖ్యం మనసు అని అర్థమైంది ఆ రోజు నుండి రాముతో స్నేహంగా ఉండడం ప్రారంభించారు ఇతర విద్యార్థులు కూడా రాను గౌరవించడం ప్రేమగా చూడడం మొదలుపెట్టారు రాము తన గుణాలతో అందరి మనసును గెలుచుకున్నాడు.
=================================================
=================================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి