చెరపకు చెట్టును: - యస్.హిందు-9వ,తరగతి-జి.ప.ఉ.పా.రామంచ-మం:చిన్నకోడూరు-జి:సిద్దిపేట

 చెట్టునురా నేను చెట్టు నురా
చెడుపకురా నన్ను చెడపకురా 
చల్లదనమును ఇచ్చెదరా
పచ్చదనముతో నుండెదరా
మీ ప్రాణాలను కాపాడెదరా
నేను మీ కల్పవృక్షమునురా
నేను లేనిదే మీప్రాణాలె లేవురా
ప్రతి జీవికి తోడైనిలిచెదరా
భూమిని పచ్చగ మార్చెదరా
నన్ను మీరు  నరికేస్తున్నారురా
మీప్రాణాలు మీరే తీసుకుంటున్నారు రా
మీరు కాలాన్ని బట్టి మారుతారురా
 నేను కాలాన్ని బట్టి కాయలు పండ్లనిస్తానురా
నా మొక్కలు భూమి లో నాటండిరా
నిత్యం నీళ్లను ఇవ్వండిరా
నన్ను మీరు రక్షించండిరా
నేను మిమ్మల్ని రక్షిస్తానురా
కామెంట్‌లు