వేదనల వేళ వెలిగే వెలుగు కీర్తి మీరు..!
మీరు చేసిన త్యాగములు ఎవరు లెక్కించలేనివి
కానీ ప్రతి రోగి గుండెల్లో ఒక మాట...
“డాక్టరు లేకపోతే నేను లేను” అనే సత్యమే,
ప్రాణాల పక్షికి పరమ ఆశయ దీపమే మీరు..!
ప్రతి దినం మళ్లీ ప్రాణాన్ని పుట్టించువారు మీరు
అందుకే మీరు మనిషిలో దేవుని రూపమే మీరు..!
మీ సేవలే మానవతకు మధురమైన స్నేహబంధం..!
మీ త్యాగమే జగతికి అమృతమైన జీవన గంధం..!
వైద్యుల దినోత్సవ వేళ (July 1)...
మంజుల పత్తిపాటి వందనం మీకు..!
జన్మజన్మల కృతజ్ఞతల పుష్పం మీకు..!
===============================
- మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి