మర్రి మోహిత ట్రిపుల్ ఐ.టి. కి ఎంపిక

 సంతవురిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధిని మర్రి మోహిత శ్రీకాకుళం కాంపస్ ట్రిపుల్ ఐటీ లో స్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.వెంకటరావు తెలిపారు. ఈమె ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్షలో మిక్కిలి ప్రతిభను చాటుకున్నారు. నేడు ఆర్ జి యు కె టి ఎ పి ట్రిపుల్ ఐటీ కి ఎంపికై పాఠశాలకే గర్వకారణంగా నిలిచిందని ఆయన హర్షం వ్యక్తం చేసారు. ఉపాధ్యాయుల కృషితో మోహిత ఎంపిక సాధ్యమైందని ఆయన ఉపాధ్యాయులను ప్రశంసించారు. 
మోహిత తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతయ్యలు సాధారణ రైతు కుటుంబీకులూ కాగా, ఈమెను ఎంతో ప్రోత్సహిస్తూ చదివించారు. పాఠశాల సహౌపాధ్యాయుల కార్యదర్శి సి.హెచ్.కమలాకర్, స్థానిక వార్డెన్ కె.అప్పారావు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పౌరులు మోహితను అభినందించారు
కామెంట్‌లు