చెట్టులా ఎదగాలి
గుట్టుగా ఎదగాలి
చెట్టులా
మట్టి లోపల ఎదగాలి
మట్టి పైన ఎదగాలి.
ఎదగడం అంటే
లోపల బయట
అని చెప్తుంది చెట్టు.!!?
మనిషి ఎదగాలి
మనసు ఎదగాలి
సమాజం ఎదగాలి.
చెట్టులా ఎదిగితే
ఆకాశము అభినందిస్తుంది
భూమి నమస్కరిస్తుంది.
మనిషి ఎదిగితే
వృక్షాలు రక్షిస్తాయి
నక్షత్రాలు ప్రకాశిస్తాయి.
చెట్టులా మనిషి ఎదిగితే
మనిషికి లోకాలు రెండు
తన లోపలి పాతాళ లోకం
బయటి భూలోకం
రెండు లోకాల్లో నీరు ఉంటుంది
మట్టి లాంటి నిజం ఉంటుంది
ఎదగడమే మిగిలి ఉంటుంది.
నరికిన మళ్లీ ఎదిగే ధైర్యం ఉంటుంది
దానికి
పచ్చని పచ్చి జీవితం ఉంటుంది.
సుడిగాలి ఉప్పెనలు సముద్ర తుఫానులకు
తట్టుకుని నిటారుగా నిలబడే
పట్టుదల ఉంటుంది చెట్టు అలా ఉంటుంది
ఎదిగితే.!!?
================================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి