సొరకాయను అనపకాయ అని కూడా అంటారు. ఇది ‘కుకుర్బిటేసి’ కుటుంబానికి చెందినది. ఇదొక కూరగాయ. తీగ జాతికి చెందిన మొక్క. ఇల్లంతా ఖాళీ అంతా తన సామ్రాజ్యంగా చేసుకుంటుంది. దీని శాస్త్రీయ నామం “లాజినేరియా వల్గారిస్”. దీనిని సంస్కృతంలో ‘ఆలాబు’ అంటారు. హిందీలో ‘అల్ ఖద్దూ’ అని అంటారు. పొడుగ్గా, గుండ్రంగా రెండు రకాలుగా సొరకాయలు కాస్తాయి. సొరకాయను సాంబారులో ఎక్కువగా వేసుకుంటారు. బెల్లంతో కలిపి “సొరకాయ పాశం” వండుకుంటే చాలా బాగుంటుంది. పువ్వులు తెల్లగా లేసుల అల్లికలా అందంగా ఉంటాయి. ఇవి రాత్రిపూట విచ్చుతాయి. వెండి వెన్నెల్లో నక్షత్రాల్లా మెరుస్తూ తోటంతా లైట్లు పెట్టినట్టుగా కనిపిస్తాయి. సొరకాయలు ఎండిపోయాక లోపలి విత్తనాలు తీసేసి మంచినీళ్ల బాటిల్ గా ఉపయోగించేవారు. నేను సొరకాయ బుర్రకు పెయింటింగ్ వేశాను. ఇందులో ఉన్న నీళ్లు చల్లగా ఉంటాయి. గుండ్రంగా కాసే సొరకాయ బుర్రలతో వీణలు చేస్తారు. మా అమ్మ చేసింది. నేను ప్రయత్నించలేదు. పిండి పదార్థాలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
కూర వండటానికి తీసిన తొక్కుతో అమ్మాయిని చేశాను. ఫోటోను గమనించండి. పీలర్ తో తీసిన తొక్కును చక్కగా అమర్చి అమ్మాయి ఆకారాన్ని తెచ్చాను. కళ్ళు, ముక్కు, నోరు కూడా తొక్కుతోనే పెట్టాను. పాప లేహంగా ను కూడా తొక్కుతోనే కుట్టాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి