ఎన్ని మెలకువలు ఉన్న
ఇష్ట అయిష్టాలతో
మనసు నిండి ఉంది.
ఎంత నిజాయితీ ఉన్న
మంచి చెడులతో
ప్రపంచం నిండి ఉంది.
ఏదీ శాశ్వతం కాదని తెలిసిన
ఆశ నిరాశలతో
జీవితం నిండి ఉంది.
కోటి విద్యలున్న
తీరని కోట్ల కోరికలు ఉన్నాయి.
ప్రతి నిమిషం మరణం ముందు
తలవంచని జంతువులు
ప్రతి పనిలో దాపూరీకం దాచిపెట్టుకునే
స్వార్థం లేని జీవులు
స్వేచ్ఛగా జీవిస్తాయి స్వేచ్ఛను ప్రేమిస్తాయి
మనిషి స్వేచ్ఛకు భయపడతాడు
బంధించబడతాడు.!!?
ప్రతి దానిలో స్వేచ్ఛను ప్రేమిస్తే
ఇష్ట అయిష్టాలు-మంచి చెడులు
ఆశ నిరాశలు-స్వార్థం కోరికలు
ఉండవు....!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి