ఒకరికి ఒకరై : - కోరాడ నరసింహా రావు.
వయసుడి గిన వేళ  ఆసరా జారి పోయినపుడు.... 
  ఆవేదనతో క్రుంగి పోక... 

ఎవరు  లేకున్న నేమి.... 
  నీకు నేనున్నా నంటు
  ఒకరికొకరు భరోసాగా
 నిల వాలి ఇలా....! 

దా0పత్య మంటే  ఇదే! 
 ఒకరి కొకరు తోడుగా... 
 దంపతులయే దిందుకే 

తల్లి, తండ్రి.... అన్నదమ్ములు, అక్కా, చెల్లెల్లు... కన్న బిడ్డలు ... 
 ఎందరున్నా...., 

జీవిత చరమా0కంలో... 
తోడు0డేది , నీడయ్యేది
 భార్యకు భర్త.... భర్తకు భార్య మాత్రమే....!! 

అంతవరకు జరిగిన అనుభవా లన్నిటి నెమరు వేసు కుంటు...చేసిన తప్పులు, పొరపాట్లు పట్టించు కొనక ఒకరిపై ఒకరు నిజమైన ప్రేమాభి మానాలను చూపించేది ఈ చరమా0కం లోనే...!! 
  
అనురాగం ఆనందపు జ ల్లై కురిసేది ఈ వృద్దాప్యం లోనే....! 

తనువులు వేరైనా... ఒకే ఆత్మయై...ప్రణానికి ప్రాణ0గా బ్రతికే అదృష్టం
 దంపతులకు ఈ వృద్ధాప్యం లోనే....! 

అంత వరకు బ్రతికి ఆ అనుభ వాన్ని పొంద గలిగే వారెందరు...?! 
    *****


కామెంట్‌లు