టాప్ సీక్రెట్.!?:- డా ప్రతాప్ కౌటిళ్యా.
జనము -ధనాన్ని -వినోదానికే వెచ్చిస్తుందీ
ప్రభుత్వము ధనాన్ని వినోదానికే వెచ్చిస్తుంది 
సమాజానికి నిజమైన ధనం వినోదమే 

జనం సమాజం మారింది 
సమాజం ఇప్పుడు సమయాన్ని వృధాగా ఖర్చు చేస్తుంది. 

సమయం ఇప్పుడు జనానికి వృధా మాత్రమే 
సమయాన్ని ఎలా ఖర్చు చేసినా 
ధనాన్ని ఎలా ఖర్చు చేసినా వృధాయే
కాలము ధనము ఇప్పుడు వృధానే. 

మనుషులకు 
సమయం సరిపోవటం లేదనేది నిజం కాదు 
సమయం వృధా చేయడమే నిజం. 

సైన్సును 
సౌకర్యం కోసం కాదు సమయాన్ని చంపడం కోసం మాత్రమే వినియోగిస్తున్నాం. 

ప్రతి రంగాన్ని ధనం సమయం వినోదం గానే మార్చింది 
సమాజము జనం. 
మనుషులు కేవలం టైంపాస్ కోసం మాత్రమే బ్రతుకుతున్నారు. ఇది టాప్ సీక్రెట్. 

మనిషి బ్రతుక్కి అర్థం లేదు అర్థము లేదు. కానీ వినోదమే ప్రధాన ధనము ఇప్పుడు. 

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.

కామెంట్‌లు